భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు మేరకు.. కడప జిల్లా తొండూరు మండలం మడురు వద్ద రోడ్డుపై అన్నదాతలు ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వివిధ లోటుపాట్లతో కూడిన ప్రస్తుత వ్యవసాయ చట్టాలను రద్దుచేసి.. రైతాంగానికి ఉపయోగపడే కొత్త చట్టాలు చేయాలని కర్షకులు డిమాండ్ చేశారు.
వేంపల్లిలోనూ సీపీఐ, కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతుల పొట్ట కొట్టే విధంగా ఉన్న చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కేంద్రం అన్నదాతకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: