కడప జిల్లా వీరపునాయునిపల్లి మండలంలోని పాయసంపల్లి గ్రామాన్ని కడప డీఎస్పీ సునీల్ సందర్శించారు. ఇటీవల గ్రామంలో ఎనిమిది మంది అరెస్టయ్యారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరాతీసి.. తగు సూచనలు ఇచ్చారు.
అసలేం జరిగింది..
కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా తలెత్తిన వివాదంలో.. పాయసం పల్లి గ్రామానికి చెందిన వైకాపా నేతలు నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డిల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో సుధాకర్ రెడ్డి తన లైసెన్సుడ్ గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రత్యర్థి వర్గం వారికి గాయాలయ్యాయి. మరుసటి రోజు మధ్యాహ్నం గ్రీన్ కో పవర్ స్టేషన్ వద్ద మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు ఏడుగురు వేట కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి యత్నించగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వేట కొడవళ్లు, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కమలాపురం కోర్టుకు తరలించారు.
ఇరు వర్గాలపై కేసులు నమోదు..
నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మహేశ్వర్ రెడ్డి వర్గంలోని ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గంలోని తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: