
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. రిమ్స్‌లో రోగులకు ప్రాణవాయువు అందక చనిపోవటం దారుణమన్నారు. స్వయాన సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితులు సరిగా లేకుంటే ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో మద్యానికి బానిసైనవారు డబ్బుల్లేక శానిటైజర్లు తాగి చనిపోతున్నారని ఆరోపించారు. కడపలో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారన్నారు. తక్షణం మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లోని కలెక్టర్లు కరోనా వైరస్ నివారణ కోసం మాత్రలు ఇంటింటికి సరఫరా చేస్తుంటే... కడప జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మూడు రాజధానుల ప్రస్తావన ఇప్పుడు అవసరమా అని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి