కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పొన్నతోట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయనేది పూర్తి అవాస్తవమని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. భారీగా కురిసిన వర్షానికి భూమి కుంగి పెద్ద గుంత ఏర్పడిందన్నారు.
సున్నితమైన అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: