లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలకు తమ వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. కడప కోర్టు ఆవరణలో 50 మంది హిజ్రాలకు ఆయన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది అవస్థలు పడుతున్నారని... ఎలాంటి ఉపాధి లేని హిజ్రాలకు తమ వంతుగా సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: