బాలికా సంరక్షణ, విద్య కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన "భేటీ బచావో-బేటీ పడావో" నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ లో భేటీ బచావో-భేటీ పడావో పథకం తీరుతెన్నులపై ఆయన ఐసీడీఎస్ అధికారులతో కలిసి వర్క్ షాప్ నిర్వహించారు.
పురుషులతో పోలిస్తే స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని... రాష్ట్రంలోనే కాకుండా కడప జిల్లాలోనూ ఈ నిష్పత్తి గణనీయంగా తగ్గుతోందని జేసీ అన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆడపిల్లల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితులు రాకముందే ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరు పుట్టినా మంచిదే అనే భావన ప్రజల్లో రావాలని ఆయన సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా నిఘా పెడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి