పులివెందుల శివారు పోలేపల్లి సమీపంలోని హెలీప్యాడ్ వద్ద దాదాపు ఆరు ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి... పాడా ఓఎస్డీ అనిల్ కుమార్, తహసీల్దారులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేశారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంలో ఈ సంస్థ ఏర్పాటు కీలకం కానుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక యువతకు అలాగే జిల్లాలోని యువతకు ఈ కేంద్రం ఏర్పాటు ఒక వరం అవుతుందన్నారు.
త్వరలోనే ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడానికి అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం వేగవంతంగా చేపడుతోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థకు అవసరమైన స్థలాన్ని, వాటి బౌండరీస్‌ను, మ్యాపులను కలెక్టర్ పరిశీలించి... ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హెలీప్యాడ్‌ను కూడా పరిశీలించారు.
ఇదీ చదవండి: