కడప జిల్లా గండికోట పునరావాస గ్రామాల్లో ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సీ. హరికిరణ్ అధికారులను ఆదేశించారు. గండికోట ముంపు ప్రాంత వాసులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ సమావేశం నిర్వహించారు. జూలై 7వ తేదీ నాటికి పునరావాస గ్రామాల్లో అన్ని పనులు ప్రారంభించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్లాన్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
కొండాపురం రామచంద్ర నగర్, రాఘవేంద్ర స్వామి గుడి, శివసాయి హైస్కూల్, ఎస్సీ కాలనీ, శ్రీ శక్తి భవన్ ప్రాంతాల్లో.. ఈనెల 25 నాటికి భూమి లెవలింగ్ పనులు, ప్లాట్ మార్కింగ్, సీసీ రోడ్డు, డ్రైనేజీలు, ఫంక్షన్ హాల్ నిర్మాణం, పవర్ సప్లై, నీటి సరఫరా పనులు పూర్తిచేయాలన్నారు. గండికోట పునరావాస గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ గండికోట ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
ఇవీ చదవండి...
కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో రైతుల పిటిషన్