Kadapa Court Granted Bail to TDP Leader BTech Ravi: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి బీటెక్ రవి జైలు నుంచి విడుదలయ్యారు. కడప కేంద్ర కారాగారం నుంచి బయటికి వచ్చారు. కడప జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి బీటెక్ రవికి బెయిలు మంజూరు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఉత్తర్వులు ఇవ్వడంతో.. హడావుడిగా కడప కేంద్ర కారాగానికి వెళ్లిన ఆయన తరపు న్యాయవాదుల జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఉత్తర్వులు అందజేశారు. సాయంత్రం 6 గంటలకు బీటెక్ రవి జైలు నుంచి బయటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు జైలు వద్ద స్వాగతం పలికారు. కడప నుంచి ఆయన పులివెందులకు బయలుదేరి వెళ్లారు. తన అరెస్ట్‌కు సంబంధించి గురువారం అన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతానని తెలిపారు.
బీటెక్ రవి హత్యకు పోలీసుల కుట్ర - కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు : ఎంపీ సీఎం రమేష్
వేంపల్లిలో టీడీపీ నాయకులు ఘన స్వాగతం.. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన ఈ సాయంత్రం కడప జైలు నుంచి విడుదలై పులివెందులకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వచ్చారు. బీటెక్ రవికి వేంపల్లి, పులివెందులలో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వేంపల్లి పట్టణంలోని హనుమాన్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో ఆయనను సత్కరించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.. అనంతరం వేంపల్లి నుంచి పులివెందులకు చేరుకున్న రవికి పులివెందులలో నాయకులు ఘనస్వాగతం పలకారు. పులివెందుల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద కార్యకర్తలు భారీగా బాణాసంచా పేలుస్తూ స్వాగతం పలకారు.
బీటెక్ రవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదా ? ఎస్పీ ప్రమాణం చేయగలరా?: సీఎం రమేష్
BTech Ravi Arrest అరెస్టు ఇలా : పులివెందుల నుంచి కడపకు వస్తున్న బీటెక్ రవిని.. వల్లూరు పోలీసులు అదుపులోకి (BTech Ravi arrest) తీసుకున్నారు. ముందుగా వల్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి కడప మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లి.. బీటెక్ రవిని హాజరు పరిచారు. ఎఫ్ఐఆర్ కాపీని రిమాండ్ రిపోర్టును అప్పటికప్పుడు బీటెక్ రవికి చూపించారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.
ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాలని రిమాండ్ రిపోర్టును వెనక్కి ఇస్తున్నట్లు మెజిస్ట్రేట్ ముందుగా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను బీటెక్ రవి తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత జడ్జి నుంచి మళ్లీ పిలుపు రావడంతో న్యాయవాదులు లోపలికి వెళ్లారు. పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయమూర్తి మరోసారి పరిశీలించి.. బీటెక్ రవికి రిమాండ్ విధించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్ట్‌పై ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
రిమాండ్‌కు కారణం: ఈ ఏడాది జనవరి 25వ తేదీన నారా లోకేశ్ కడపకు వచ్చినప్పుడు జరిగిన గొడవ కారణంగా పోలీసులు బీటెక్ రవిని అరెస్టు (BTech Ravi arrest) చేసి రిమాండ్‌కు తరలించారు. లోకేశ్ కడపలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో లోకేష్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలివచ్చారు. విమానశ్రయం గేటు వద్ద లోపలికి వెళ్లడానికి బీటెక్ రవి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయనే కారణంతో బీటెక్ రవిపైన 10 నెలల తర్వాత పోలీసులు కేసు నమోదు (Police registered a case against BTech Ravi) చేశారు.