రేపు జరగబోయే ఓట్ల లెక్కింపునకు కడప శివారులోని కేఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 314 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం 2 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ నెల 23న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, ఈటీపీబీఎస్ ఓట్లు లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎంలను లెక్కిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గంతో పాటు బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం అవుతుందన్నారు. ఎక్కడైనా ఈవీఎం డిస్ ప్లే కాకపోతే వాటి స్థానంలో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. అన్ని సవ్యంగా సాగితే 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వీవీప్యాట్ స్లిప్పులతో సహా ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు ఎవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 1200 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
'సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ పూర్తి చేస్తాం' - counting
ఎన్నికల సమయంలో జరిగిన గొడవల దృష్ట్యా కడపలో కౌంటింగ్ రోజున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 1200 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు.