కడప జిల్లాలో సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు జరిగే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షలు-2020కి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ఆయన తెలిపారు. జిల్లాలో రెండవ దశ గ్రామ వార్డు, సచివాలయ కార్యదర్శుల పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షల హాల్టికెట్లు కూడా సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు.
మొదటి విడత జిల్లాలో నిర్వహించిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని... ఆ పరీక్షల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్ష కేంద్రాల్లో మౌలిక ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు మరియు అభ్యర్థులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్లస్టర్ లను ఏర్పాటు చేసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కడప, రాయచోటి, బద్వేల్ పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట తదితర 6 క్లస్టర్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న జరిగే మొదటి రోజు ఉదయం కేటగిరీ-1 కి చెందిన పంచాయతీ సెక్రెటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పరీక్షకు 95 కేంద్రాలలో ఎక్కువ సంఖ్యలో 18479 మంది అభ్యర్థులు హాజరు అవుతారని అన్నారు. అలాగే మధ్యాహ్నం 55 కేంద్రాలలో జరిగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్, డిజిటల్ అసిస్టెంట్ పరీక్షకు 13428 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
ఇదీ చూడండి. 'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'