రాష్ట్ర ప్రభుత్వం సి.పి.బ్రౌన్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కడప ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. తెలుగు సూర్యుడు సి.పి. బ్రౌన్ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుజాతి అభ్యున్నతికి సి.పి.బ్రౌన్ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. పరాయి దేశీయులు అయినప్పటికీ తెలుగు భాష కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...తిరుమలలో పూజా కార్యక్రమాలపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు అభ్యంతరం