దొంగతనాలకు పాల్పడే ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు దొంగతనాలు చేసేవారు. ఇప్పటివరకు వారిపై 24 కేసులు నమోదైనట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడుగురు నిందితుల నుంచి రూ.48,500 నగదు, ఏడు లక్షల 10వేల విలువైన బంగారు ఆభరణాలు, 6 సెల్ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అరెస్టయిన వారంతా యువకులు కావడం గమనార్హం.
ఇదీ చదవండీ... 'క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రాష్ట్రంలోకి అనుమతిస్తాం'