Kadapa Ameen Peer Pedda dargah: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కడప అమీన్ పీర్ పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12వ తేదీ వరకు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి దర్గా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. వసతుల కల్పన కోసం ప్రభుత్వం తరఫున కోటి రూపాయల చెక్కును దర్గా నిర్వాహకులకు అందజేశామని చెప్పారు. ఇవాళ గంధం, రేపు ఉరుసు మహోత్సవం ఉంటుందని తెలిపారు.
450 సంవత్సరాల చరిత్ర: పెద్ద దర్గాకు దాదాపు 450 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పారు. ఉరుసుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల వసతులను కల్పించామని ఆయన తెలిపారు.
డీఎస్పీ వెంకటశివారెడ్డి: బందోబస్తు దృష్ట్యా 150 మంది పోలీసులను ఏర్పాటు చేశామని డీఎస్పీ వెంకటశివారెడ్డి చెప్పారు. దర్గా ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈవ్టీజింగ్ , దొంగతనాలు జరగకుండా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇవీ చదవండి: