శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు నుంచి అనంతపురం జిల్లా జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు.. తెదేపా నేతలపై వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి విమర్శించారు. కడప కేంద్ర కారాగారం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల కానున్న తరుణంలో అభిమానులతో అక్కడకు తరలివచ్చారు. తెదేపాను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే లేనిపోని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వారు ఎన్నికుట్రలు చేసినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవీ చదవండి..
కాసేపట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల... కారాగారం వద్దకు వచ్చిన శ్రేణులు