ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లా కమలాపురం మండలం మాచిరెడ్డిపల్లికి వచ్చిన ఆయన... అప్పుల తెచ్చి రాష్ట్రాన్ని ఎన్నోరోజులు పాలించడం సాధ్యం కాదన్నారు....వచ్చే బడ్జెట్ కల్లా నవరత్నాలు మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్ట్‌లు ఏవీ జగన్ చేపట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకొనే తనకు సంబంధించిన లారీలు, బస్సులు ఆపేశారని అన్నారు. తన వ్యాపారం దెబ్బతీయాలని జగన్ ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు.
'నేను భయపడేది లేదు. వ్యవసాయం చేసుకోనైనా ఉండగలను. జగన్ బెదిరింపులకు లొంగను, భయపడను'- జేసీ దివాకర్ రెడ్డి తెదేపా నేత
ఇదీ చదవండి: బడుగులకు భరోసా...పేదలకు బాసట