నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం.. ఇబ్బందుల్లో ప్రజలు
కడప జిల్లాలో రైల్వేకోడూరు పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 30 వేలకు పైగా జనాభా ఉన్నఈ పట్టణానికి నిత్యం నియోజకవర్గ ప్రజలు వస్తూ పోతుంటారు. ప్రధాన రహదారి వెంబడి వీధి దీపాలు ఏర్పాటు చేసినా.. నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్లన్నీ చీకట్లోనే ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా వీధి దీపాలు లేకపోవటంతో ప్రయోజనం లేకుండా పోతుందని స్థానికులంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
వెలగని వీధి దీపాలు ... చీకట్లో బాటసారులు