కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వాహనం సహా 2 లక్షల 40 వేల విలువ గల... 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రవికుమార్ వెల్లడించారు. బయనపల్లె బీట్ దేవరకోన నుంచి ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అటవీ అధికారులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు తప్పించుకోగా తమిళనాడుకు చెందిన తంగరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రవికుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: రూ.20 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం