కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం, పలుగురాళ్లపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 1938లో అక్రమ మైనింగ్‌పై మండల వైకాపా నాయకుడు వీరనారాయణ రెడ్డి కుటుంబీకులు అక్రమ మైనింగ్ చేస్తున్నట్లుగా మండల తెలుగుదేశం పార్టీ నేత పోలిరెడ్డి ఆరోపణలు చేయడమే కాకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలిరెడ్డి ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి డిసెంబరు 1వ తేదీ నాటికి పూర్తి నివేదికను అందజేయాల్సిందిగా గనులు, భూగర్భ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన గనులు, భూగర్భ శాఖ అధికారులు నివేదికను తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. 2005 నుంచి 2015 సంవత్సరం వరకు జరిగిన మైనింగ్‌లో అనుమతులకు మించి ఖనిజాన్ని తవ్వి తీసినట్లుగా అధికారుల విచారణలో తేలింది. అధికార యంత్రాంగం మాయాజాలంతో సుమారు 1 కోటి 98 లక్షల నుంచి కేవలం 24 లక్షలకు తగ్గిన జరిమానాను కూడా చెల్లించకుండా ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్న వైకాపా నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండీ... విజయవాడ యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం