కడప జిల్లాలో ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్న అక్రమ మద్యం, నాటు సారాను శనివారం ధ్వంసం చేశారు. జిల్లాలో కడప, రాయచోటి, కోడూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు ప్రాంతాల్లో అధికారులు ఇటీవల కాలంలో దాడులు నిర్వహించారు. 51 కేసులలో 341 లీటర్ల అక్రమ మద్యం, 351 లీటర్ల సారాను పట్టుకున్నారు. ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు వీటిని ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి