కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎవరి ఇళ్లలో వారే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కడప నగరపాలక కమిషనర్ లవన్న పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తే తాము విగ్రహాలను తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కరోనా సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వినాయక చవితికి చందాలు అడిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పెద్ద పెద్ద విగ్రహాలను విక్రయించవద్దని నిర్వాహకులకు సూచించారు.
ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్: జమ్మలమడుగులో మూతపడ్డ రెండు బ్యాంకులు