లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మార్చి 21న జనతా కర్ఫ్యూ, 22వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో.. ఈ ప్రభావం ఆర్టీసీపై విపరీతంగా పడుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు ఇంతవరకు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం అవుతుండగా.. మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో 200 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 44 ఆర్టీసీ బస్సులు, 35 అద్దె బస్సులు ప్రజలకు అందుబాటులో ఉన్నా..లాక్ డౌన్ కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి.
ఇదీ చూడండి: