ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 3వ రోజు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ - distribution of housing patta documents

రాష్ట్రవ్యాప్తంగా 3వ రోజు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టాలు అందజేశారు. అర్హులందరికీ పట్టాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

distribution of housing documents
రాష్ట్రవ్యాప్తంగా 3వ రోజు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 3వ రోజు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ
author img

By

Published : Dec 27, 2020, 5:18 PM IST

కడప జిల్లావ్యాప్తంగా 1.10 లక్షల మంది లబ్దిదారులకు సొంతింటి కలను సాకారం చేస్తూ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. 3వ రోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు మండలంలో పొన్నతోట, పెద్దండ్లురుకు చెందిన 168 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అర్హులందరికీ పట్టాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అనంతపురంలో..

ఇంటి స్థలాల పట్టాల పంపిణీలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో 1500 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీలో పలుచోట్ల చంద్రబాబు పేరు వినిపించడం వల్ల కదిరిలో జరిగిన పట్టాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాగ్రత్తపడ్డారు. 'ఇల్లు కట్టించాలని దృఢసంకల్పం జగనన్నది.. పేదోళ్ల కొంపలు కూల్చే ఆలోచన చంద్రబాబుది' అంటూ పలువురు మహిళల చేత నినాదాలు చేయించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఈ తరహా విమర్శలు చేయించడంపై పలువురు పెదవి విరిచారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్, శాసనసభ్యుడు సిద్ధారెడ్డి, తదితరులు హాజరయ్యారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గండేపల్లి, పేరకలపాడు, కేసర, పెండ్యాల, వేములపల్లి, ఎస్. అమరవరం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న కాలనీలకు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలకు చెందిన 1729 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. మొదటి విడతలో అర్హులకు ఇళ్ల స్థలాలు రాకపోతే రెండో విడత భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ వీరభద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరిలో...

పేదలకు సొంతిళ్లు ఏర్పాటు చేయాలన్నది సీఎం జగన్​ ఆకాంక్ష అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో కోట్లాది రూపాయలతో స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తామన్నారు.

తూర్పుగోదావరిలో...

ప్రతి నిరుపేదకు ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు గ్రామంలో మండల పరిధిలోని 2329 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

'ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేది చంద్రన్న కాదమ్మా... జగనన్న!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.