Road Width Increasing In Kadapa: కడపలో మళ్లీ కట్టడాల కూల్చివేత పర్వం మొదలైంది. మాసాపేట కూడలి నుంచి చలమారెడ్డి పల్లె రింగ్ రోడ్డు వరకు రోడ్డుకి ఇరువైపులా 80 అడుగుల మేరకు ఉన్న కట్టడాలను అధికారులు ఇదివరకే కూల్చివేశారు. ఇవి కాకుండా మరో 20 అడుగుల మేర గుర్తులు వేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. 20 అడుగుల మేరకు నివాసాలను కూల్చివేస్తే ఇక రోడ్డుపై పడాల్సిందేనని బాధితులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇప్పుడున్న రోడ్డు వెడల్పు చాలని.. మరో 20 అడుగులు చేస్తే పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులకు సూచించారు. పైగా మాసాపేట మార్గంలో పెద్దపెద్ద వాహనాలు వెళ్ళవని.. ఇలాంటి ప్రాంతాలలో రోడ్లు వెడల్పు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. టీడీపీ నాయకులు అధికారులకు సర్దిచెప్పడంతో వారు వెనుతిరిగారు. 80 అడుగుల రోడ్డు వెడల్పు చేయడంతోనే సగానికి సగం నివాసాలు పోయాయని.. ఇప్పుడు 100 అడుగులు చేస్తే చెట్ల కింద జీవించాల్సి వస్తుందని నాయకులు అధికారులను సూచించారు.
ఇవీ చదవండి