ETV Bharat / state

చదువంటే ధ్యాస లేదు... సినిమాలంటే పిచ్చి..! - షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ హేమంత్ న్యూస్

సినిమా తీయాలంటే... చదువు అవసరమా..! అవునవునూ అవసరమే.. టెక్నికల్ భాష తెలియాలిగా.. అంటారా ఏంటీ..? అలా కాదు. సినిమా అంటే పిచ్చి ఉంటే చాలు. పదోతరగతి పాస్ కాకున్నా... దర్శకత్వంలో చింపేయోచ్చు అంటున్నాడో యువకుడు. తండ్రి మరణాన్నే ఇతివృత్తంగా లఘుచిత్రం తీశాడు ఆ యువదర్శకుడు. చూద్దామా అతడి కథ.

చదువంటే ధ్యాస లేదు.. సినిమాలంటే మాత్రం పిచ్చి!
author img

By

Published : Nov 21, 2019, 7:02 AM IST

చదువంటే ధ్యాస లేదు.. సినిమాలంటే మాత్రం పిచ్చి..!

సామాజిక అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని... మంచి సందేశాత్మక లఘు చిత్రాలు తీస్తూ... అందరి మన్ననలు పొందుతున్నాడు కడపకు చెందిన యువ దర్శకుడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నా... అనేక లఘుచిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రజలకు చైతన్యం కల్గించేందుకు పోలీసులు సైతం లఘు చిత్రాలు చేయించారు. ప్రస్తుతం సామాజిక ఇతివృత్తంగానే తక్కువ బడ్జెట్​లో సినిమా తీస్తున్న... కడపకు చెందిన పేదింటి కుర్రాడు, యువ దర్శకుడు హేమంత్ రెడ్డిపై కథనం.

ఎమర్జెన్సీతో మెుదలు..!
హేమంత్ రెడ్డి... కడప నగరానికి చెందిన నరసింహులు, అంజనమ్మ దంపతుల కుమారుడు. ఏడో తరగతి మాత్రమే చదివిన ఇతనికి చదువుపై ధ్యాస లేదు. చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూసిన ఈ యువకుడు... అక్కడికే వెళ్లాలనే తపనతో సినీరంగానికి చెందిన కెమెరామెన్​తో పరిచయం పెంచుకున్నాడు. ఆయనిచ్చిన సలహాలు, సూచనలతో 2014లో లఘు చిత్రాలు తీయడం ఆరంభించారు. తొలిసారిగా "ఎమర్జెన్సీ" అనే లఘు చిత్రం తీశాడు. అంబులెన్సులకు దారి ఇవ్వకపోతే... అందులోని బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని చక్కగా చూపించాడు.

నేను తప్పు చేశాను..!
2017లో హేమంత్ రెడ్డి తండ్రి నరసింహులు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆటోలో వెళ్తుండగా... ఎవరో ఆకతాయి చేసిన పొరపాటుకు తన తండ్రి మృతిచెందాడు. చాలా రోజులు కుమిలిపోయిన హేమంత్ రెడ్డి... ఇలా ఎవ్వరూ చేయకూడదనే ఉద్దేశంతో... ప్రజలకు చైతన్యం కల్గించాలని తపించాడు. అంతే... "నేను తప్పు చేశాను" అనే లఘు చిత్రాన్ని తీశాడు. అలా కడప జిల్లా పోలీసుల నుంచి హేమంత్​కు మంచి అవకాశం వచ్చింది.

పోలీసులతో కలిసి..!
ప్రధానంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారికి చైతన్యం కల్గించాలనే ఉద్దేశంతో... నేను తప్పు చేశాను అనే లఘు చిత్రాన్ని జిల్లాలోని అన్ని కళాశాలల్లో ప్రచారం చేయించారు పోలీసులు. తర్వాత మట్కా మహమ్మారికి బానిసలవుతున్న వారికి అవగాహన కల్పించేందుకు "పరివర్తన" అనే లఘు చిత్రాన్ని తీయించారు. ఆత్మహత్యల నివారణకు ప్రజలను చైతన్యం చేయాలని భావించి "క్షణం" అనే లఘు చిత్రాన్ని తీశారు. అలా... సామాజిక అంశాలతో అనేక లఘుచిత్రాలు తీసి... ప్రశంసలు అందుకున్నాడు హేమంత్. గుంటూరు పోలీసులు.."ఆట", "ఊపిరి", "చేతన" లాంటి చిత్రాలు తీయించారు. ఇవే కాకుండా జనసేన, వైకాపా, తెదేపా రాజకీయ పార్టీలకు లఘు చిత్రాలు తీసి ఇచ్చాడు హేమంత్.

ఇప్పుడో సినిమా డైరెక్షన్..!
ఇప్పుడు కడప కుర్రాళ్లతో కలిసి తక్కువ బడ్జెట్​తో రెండున్నర గంటల సినిమా తీశారు. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో, లఘు చిత్రాల్లో అవకాశం దక్కిన కడప కుర్రాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హేమంత్ రెడ్డి ప్రతిభ అమోఘం అని... దర్శకుడైనా షూటింగ్​లో అన్ని పనులు చేస్తారని చెబుతున్నారు. పేదింటి కుర్రాడు అంకిత భావంతో సినిమాలు, మంచి సందేశాత్మక లఘు చిత్రాలు తీయడమే కాకుండా... ఆసక్తి ఉన్న కడప కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం మరిచిపోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటికైనా సినిమా రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో... కష్టపడి పనిచేస్తున్నానని యువ దర్శకుడు హేమంత్ రెడ్డి చెబుతున్నాడు. త్వరలోనే హైదరాబాద్​కు మకాం మార్చి... సినిమా రంగంలో అవకాశాలు దొరకబుచ్చుకోవాలనే తలంపుతో ఉన్నాడు ఈ యువ దర్శకుడు.

ఇదీ చదవండి: అంతర్జాతీయ స్టార్స్​తో 'ఆర్ఆర్ఆర్' హంగామా

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.