ఇదీ చదవండి:
'ఉపాధి తగ్గింది.. ప్రభుత్వమే ఆదుకోవాలి'
ప్రభుత్వం అమలు చేస్తున్న విడతల వారీ మద్య నిషేధంతో తమ ఉపాధి పోతోందని కడపలోని హమాలీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మద్యం ఎగుమతులు, దిగుమతులు బాగా ఉన్నప్పుడు నిత్యం 800 రూపాయల వరకు సంపాదించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక 20 శాతం మేర మద్యం సరఫరా తగ్గిందని.. ఇప్పుడు రోజుకు 300 రూపాయలు రావడం గగనమైందని ఆవేదన చెందారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తే.. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉపాధి కల్పించాలని వేడుకున్నారు.
ఉపాధి తగ్గిందంటూ కడప హమాలీల ఆవేదన