లాక్డౌన్ సడలింపుల క్రమంలో కడప జిల్లా రైల్వేకోడూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు కరోనా నివారణ చర్యలపై టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని శ్రీనివాసులు తెలిపారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, వైద్య సహాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కరోనా కట్టడికి సమన్వయంతో చర్యలు వేగవంత చేయాలని సూచించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్లీచింగ్, ఫాగింగ్, సోడియం హైపో క్లోరైడ్ వంటి క్రిమిసంహారక మందులు చల్లాలని, నిత్యం శానిటేషన్ చెయ్యాలని విప్ శ్రీనివాసులు సూచించారు. కరోనా నియంత్రణలో శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల పనితీరు అభినందననీయమన్నారు.
దుకాణాల్లో రిజిస్టర్ పెట్టాలి
నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇప్పటికే మాస్కులు పంపిణీ చేశామని.. అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు అన్నారు.నిబంధనల ప్రకారమే దుకాణాలు తెరవాలని.. అలాగే ఎవరెవరు వస్తున్నారు అనే దానిపై ఒక రిజిస్టర్ పెట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు నడిచే అవకాశం ఉన్నందున... వచ్చేవారిని నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్‌కు పంపించాలని అధికారులకు ఆదేశించారు.
ఇవీ చదవండి: