ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు రోజు కంగెన్ వాటర్ అందించడం భేష్' - సేవా సంస్థ వ్యవస్థాపకుడు జిన్నా షరీఫ్

కడప జిల్లా రాయచోటిలోని గోవింద్ కేర్ సెంటరను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానం పరిశీలించారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడారు.

కరోనా వైద్యసేవలపై ఆరా తీసిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్​రెడ్డి

author img

By

Published : Oct 3, 2020, 9:43 PM IST

కడప జిల్లా రాయచోటిలోని గోవింద్ కేర్ సెంటరను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానం పరిశీలించారు. వైరస్ బాధితులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు.

వారికి సేవలు అందాలనే కేర్ సెంటర్..

కరోనా బాధితులకు స్థానికంగానే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేశామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనంతరం కొవిడ్ బాధితులకు సేవా సంస్థ అందించిన కంగెన్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కంగెన్ వాటర్​తో శరీరానికి అధిక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రోగనిరోధక శక్తిని ఇస్తుంది..

శరీరంలోని వ్యర్థ, విషతుల్యాలను ఇది తొలగిస్తుందన్నారు. శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అత్యధిక స్థాయిలో అందిస్తుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక లీటర్ కంగెన్ వాటర్ వంద ఆపిల్స్ తో సమానమని వివరించారు. కరోనా బాధితులకు కంగెన్ వాటర్ మంచి శక్తిని ఇస్తుందని చెప్పారు.

జిన్నా సేవా సంస్థ సేవలు భేష్..

జిన్నా సేవా సంస్థ ఆధ్వర్యంలో తరచూ సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. రూ.5 లక్షల వ్యయంతో కంగెన్ వాటర్ సరఫరా చేయడం అభినందనీయమని సేవా సంస్థ వ్యవస్థాపకుడు జిన్నా షరీఫ్​ను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.

రోజుకు 2 లీటర్ల అందజేత..

కొవిడ్ కేర్ సెంటర్​లోని బాధితులకు 2 లీటర్ల చొప్పున రోజూ కంగెన్ వాటర్ అందిస్తున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

తెలంగాణ హైకోర్టు: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.