ప్రియుడు మోసగించగా కోమాలో ఉన్న బాధిత గిరిజన యువతిని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. కడప జిల్లా రాయచోటిలోని లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న బాధితురాలి ఇంటికి వెళ్లి వెంటిలేటర్‌పై ఉన్న యువతిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటుందని.. అధైర్య పడవద్దని దైర్యం ఇచ్చారు. వైద్య ఖర్చులను ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రూపంలో అందిస్తామని తెలిపారు. బాధితురాలు పూర్తిగా కోలుకునేంత వరకు వైద్యం, ఆహారం తదితర సౌకర్యాలను తన సొంత నిధులతో కల్పిస్తామని బాధిత కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. బాధితురాలికి చట్టపరంగా న్యాయం అందుతుందన్నారు. మానవత్వంతో చూడాల్సిన సంఘటనపై కూడా కొందరు స్వార్థ రాజకీయాలు చేస్తుండడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి: 11 ఏళ్ల బాలుడ్ని బలిగొన్న మూఢనమ్మకం!