కడప జిల్లా(kadapa district) నబీ కోటలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును(Gold chain theft) అపహరించారు. నబీ కోటకు చెందిన లక్ష్మీదేవి తన స్కూటీపై నీటి శుద్ధి కేంద్రం వద్దకు వెళ్లి.. నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చింది.
నీటి క్యాన్ దించుతున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి.. ఆమె మెడలో ఉన్న 2.7 గ్రాములు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన బంగారు గొలుసు రూ.80 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి