గంజాయి స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. గంజాయి రవాణాను పోలీసులు ఎన్ని విధాలుగా అడ్డుకుంటున్నా.. స్మగ్లర్లు రోజురోజుకు కొత్త ప్లాన్లతో రవాణా చేస్తూనే ఉన్నారు. పొడి, ద్రవ రూపంలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కడప పోలీసులు పట్టుకున్నారు. వారిని డీఎస్పీ కార్యాలయంలో హాజరు పరిచారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సునీల్ తెలిపారు. ద్రవరూప గంజాయి లీటరు ధర ఐదు లక్షలకు అమ్ముతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: SUICIDE ATTEMPT : మహిళ ఆత్మహత్యాయత్నం... కుటుంబ సమస్యలే కారణం