కడప జిల్లా జమ్మలమడగు మండలంలో ఉన్న గండికోట ఉత్సవాలు శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 11,12 తేదీల్లో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఉత్సవ బెలూన్ను ఆవిష్కరించి కలెక్టర్ శోభాయాత్రను ప్రారంభించారు. ఉత్సవాల్లో అనేక సాహిత్య, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. యువతను ఆకర్షించేందుకు సాహస క్రీడలు, లేజర్ షోలు, కొండలపై చేసే విన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను 11వ తేదీన మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభిచనున్నట్లు వెల్లడించారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: గండికోట ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జేసీ