కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పర్యటక ప్రాంతం గండికోట ఆగ్నేయంలో... కోటగోడ వద్ద రాయల చెరువు ఉంది. ఈ చెరువును పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించారు. అందుకే ఈ చెరువును రాతి చెరువు, రాజుల చెరువు, రాయల చెరువు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. యుద్ధ సమయంలో కోటలో నెలల తరబడి ఉండే రాజు, అతని పరివారానికి ఈ చెరువే నీటి అవసరాలను తీర్చేది.
ఈ చెరువు నుంచి జుమ్మా మసీదు వరకు నీరు సరఫరా అయ్యేది. రాయల చెరువుకు తూర్పున ఉన్న నీటి గొట్టాల వ్యవస్థను... నేటికీ మనం చూడవచ్చు. కుతుబ్షాహీ శైలిలోనే ఈ గొట్టాల వ్యవస్థ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి రాజులను స్ఫూర్తిగా తీసుకొని... ప్రభుత్వాలు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి...పోలవరానికి నిధులెలా?.. బడ్జెట్‌లోనూ మొండి చెయ్యి