సమస్యల పరిష్కారం కోసం కడప జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరులో గండికోట నిర్వాసితులు చేస్తున్న దీక్షలు 35వ రోజుకు చేరాయి. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే జలాశయంలో నీళ్లు నింపాలని వారు డిమాండ్ చేశారు. తాళ్ల పొద్దుటూరు గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలో వెనక జలాలు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పునరావాస కాలనీల్లో సదుపాయాలు మెరుగుపరచాలని, వెలుగొండ తరహా ప్యాకేజీ కల్పించాలని కోరారు.
ఇదీచదవండి.