కడప చరిత్రకు సజీవసాక్ష్యం గండికోట ...అద్భుతశిల్పకళకు పెట్టింది పేరు...ఒక వైపు పెన్నానది ప్రవాహం...మరోవైపు శత్రుదుర్భేద్యమైన కోట దుర్గం..మతసామరస్యానికి ప్రతీక...చూపరులకు రెండు కళ్లు చాలవే అన్నట్లు అన్పించే శిల్పకళా కావ్యం..వందల ఏళ్లు చరిత్ర కలిగిన ఈ కట్టడం విశిష్టతను తెలియజేయడానికి గండికోట వారోత్సవాలు నిర్వహిస్తోంది ఏపీ సర్కారు.
గండికోట వైభవాన్ని చాటిచెప్పేలా కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో..ఈ నెల 9, 10 తేదీల్లో అంగరంగవైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలను ఉత్సవాల పట్ల అవగాహన కల్పించేందుకు విస్తృతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజంపేటలో నిర్వహించిన ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ విన్యాసాలతో అలరించారు. దేవతామూర్తుల వేషధారణలు, అలనాటి రాజుల వేషధారణ, కొయ్య బొమ్మ ఆట, స్టిక్ వాకింగ్, గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనలతో ఆద్యంతం అలరించారు.
ప్రభుత్వ క్రీడామైదానంలో కడప విహాంగ్ అడ్వెంచర్ ఆధ్వర్యంలో... నిర్వహించిన పారా మోటర్ విన్యాసం ఆకట్టుకుంది. పారా మోటార్ ప్లైయింగ్ లో ఇద్దరు యువకులు కూర్చొని ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ మోడలింగ్ షో యువత, పిల్లలు, మహిళలను ఆకర్షించింది.
గండికోట ఘనచరిత - కడప జిల్లా
చారిత్రక వైభవానికి సజీవసాక్ష్యం గండికోట...అద్భుత శిల్పకళకు నిలయం...చుట్టూ లోయలు..మధ్యలో పెన్నానది ప్రవాహం...సందర్శకులను ఎంతోగానో ఆకట్టుకునే ఈ గండికోట విశిష్టతను నేటి తరానికి తెలియజేసేందుకు వారోత్సవాలు నిర్వహిస్తోంది ఏపీ సర్కారు.
కడప చరిత్రకు సజీవసాక్ష్యం గండికోట ...అద్భుతశిల్పకళకు పెట్టింది పేరు...ఒక వైపు పెన్నానది ప్రవాహం...మరోవైపు శత్రుదుర్భేద్యమైన కోట దుర్గం..మతసామరస్యానికి ప్రతీక...చూపరులకు రెండు కళ్లు చాలవే అన్నట్లు అన్పించే శిల్పకళా కావ్యం..వందల ఏళ్లు చరిత్ర కలిగిన ఈ కట్టడం విశిష్టతను తెలియజేయడానికి గండికోట వారోత్సవాలు నిర్వహిస్తోంది ఏపీ సర్కారు.
గండికోట వైభవాన్ని చాటిచెప్పేలా కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో..ఈ నెల 9, 10 తేదీల్లో అంగరంగవైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలను ఉత్సవాల పట్ల అవగాహన కల్పించేందుకు విస్తృతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజంపేటలో నిర్వహించిన ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ విన్యాసాలతో అలరించారు. దేవతామూర్తుల వేషధారణలు, అలనాటి రాజుల వేషధారణ, కొయ్య బొమ్మ ఆట, స్టిక్ వాకింగ్, గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనలతో ఆద్యంతం అలరించారు.
ప్రభుత్వ క్రీడామైదానంలో కడప విహాంగ్ అడ్వెంచర్ ఆధ్వర్యంలో... నిర్వహించిన పారా మోటర్ విన్యాసం ఆకట్టుకుంది. పారా మోటార్ ప్లైయింగ్ లో ఇద్దరు యువకులు కూర్చొని ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ మోడలింగ్ షో యువత, పిల్లలు, మహిళలను ఆకర్షించింది.
కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని గండికోట వైభవాన్ని చాటిచెప్పేలా ఈనెల 9 10 తేదీల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలను ఉత్సవాల పట్ల అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజంపేటలో బుధవారం నిర్వహించిన ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయి. స్థానిక రోడ్లు భవనాల శాఖ కార్యాలయం నుంచి మార్కెట్, అమ్మవారి శాల, పాత బస్టాండ్, ఎల్ఐసి, సబ్ కలెక్టర్ కార్యాలయం మీదుగా ప్రభుత్వ క్రీడామైదానం వరకు శోభాయాత్ర సాగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. దేవతామూర్తుల వేషధారణలు, అలనాటి రాజుల వేషధారణలో భిన్న సంస్కృతులు వేషాలు, కొయ్య బొమ్మ ఆట, స్టిక్ వాకింగ్, గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటం, చెక్కభజన లతో ఆద్యంతం అలరించారు. రాజంపేట పట్టణం, మండలం ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, జూనియర్ కళాశాల, డిగ్రీ విద్యార్థులు, పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన సుమారు మూడు వేల మంది విద్యార్థులు శోభాయాత్రలో పాల్గొన్నారు. కాగా డిజె సౌండ్ సిస్టం వద్ద యువత చేసిన సందడి, అరుపులు, కేకలు పట్టణములో మారుమ్రోగాయి. డిజె సౌండ్ సిస్టం వివిధ సినిమా పాటలకు యువత నృత్యం చేస్తూ సందడి చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు సాగిన శోభాయాత్రలో ఎక్కడ అలుపెరగకుండా కేరింతలు, నృత్యాలతో చిందులేస్తూ సాగారు. ప్రభుత్వ క్రీడామైదానంలో కడప విహాంగ్ అడ్వెంచర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారా మోటర్ విన్యాసం ఆకట్టుకుంది. పారా మోటార్ ప్లేయింగ్లో ఇద్దరు యువ కూర్చొని ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ మోడలింగ్ షో యువతను, పిల్లలను, మహిళలను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కడప జాయింట్ కలెక్టర్లు కోటేశ్వరరావు, శివారెడ్డి, ఆర్డీవో కోదండరామి రెడ్డి, జిల్లా సైనిక విభాగం అధికారి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బత్యాల చంగల్ రాయుడు, పురపాలక కమిషనర్ ఎం.వి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Body:అంబరాన్నంటిన గండికోట ముందస్తు సంబరాలు
Conclusion:కడప జిల్లా రాజంపేట