బద్వేల్ లో తెదేపా మాజీ శాసన సభ్యురాలు విజయమ్మకు.. భాజపా నేతలు రూ.10 కోట్లు ఇచ్చారన్న ఆరోపణల్ని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. శాసన సభ్యులకు, మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలు నిర్దేశించడంతో.. వాటిని అధిగమించేందుకు వారు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవాచేశారు.
భాజపా కార్యకర్తలను, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ.. భాజపా కార్యకర్తలు ఓటర్లు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బద్వేల్ ఉప ఎన్నికలను భాజపా సీరియస్గా తీసుకోవడంతోనే 15 కంపెనీల కేంద్ర బలగాలను పంపించారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వైకాపా వాళ్లు ఓటర్లను తెప్పించుకున్నారని.. గతంలో ఎన్నడూ ఇలాంటి ఉప ఎన్నికలు ఎప్పుడు చూడలేదని చెప్పారు.
ఇదీ చదవండి: BJP: బద్వేలులో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు: సోము వీర్రాజు