వికటించిన ఐరన్ మాత్రలు.. విద్యార్థినులకు అస్వస్థత - latest news of kadapa gurukul school
ఐరన్ మాత్రలు వికటించి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కడప జిల్లా లింగాలమండలంలో జరిగింది. గురుకుల పాఠశాల విద్యార్థినులు భోజనం ముందు ఐరన్ మాత్రలు తీసుకున్నారు. అనంతరం కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితులను పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అందరికీ వైద్య సేవలు అందించామని.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని... తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.
చికిత్స పొందుతున్న విద్యార్థులు
By
Published : Jan 3, 2020, 12:03 PM IST
ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
AP_CDP_51_02_VIDAYARTHULAKU_ASWARATHATHA_av_AP10042
REPORTER:-M.MaruthiPrasad
CENTER:-Pulivendula
యాంకర్ వాయిస్: కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల వద్ద ఉన్న బాలయోగి బాలికల గురుకుల కళాశాల చెందిన 26 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, వాంతులతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వివరాల్లోకి వెళితే లింగాల మండలం ఇప్పట్ల వద్ద ఉన్న బాలయోగి గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనానికి ముందుగానే ఐరన్ టాబ్లెట్స్ హెల్త్ ఎడ్యుకేటర్ ఇవ్వడంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. దీంతో గురుకుల్ పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 26 మంది విద్యార్థులను గురుకుల పాఠశాల సిబ్బంది తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు విద్యర్థినుల పరిస్థితి తీవ్రంగా ఉంది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలి వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వైద్య సిబ్బంది, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వారు వాపోతున్నారు. విద్యార్థినులకు కడుపు నొప్పి తీవ్రంగా ఉండడంతో ఏడుస్తున్నారు. తమ పిల్లల పరిస్థితి ఇలా ఉందని కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని కళాశాల సిబ్బంది పై విద్యార్థినుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది.