ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ లీక్​.. ఐదుగురికి గాయాలు - kadapa district gas leak news

ఇంట్లో గ్యాస్ లీకై ఐదుగురు గాయపడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. రాత్రి సమయంలో గ్యాస్ లీకేజిని కుటుంబసభ్యులు గమనించని కారణంగా.. ఈ ప్రమాదం జరిగింది. బాధితులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

gas leak
గ్యాస్ సిలిండర్ లీక్
author img

By

Published : Aug 23, 2021, 10:11 AM IST

కడప జిల్లా రాజంపేట పట్టణం మంగలమిట్టలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ ఘటనలో.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఓ ఇంటిలో ఆదివారం నూతన గ్యాస్ సిలిండర్​ను అమర్చారు. ఆ సమయంలో గ్యాస్ లీక్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరూ గమనించలేదు.

తెల్లవారుజామున లైట్లు వేయగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్​కు తరలించారు.

ఇదీ చదవండి:

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.