కడప జిల్లా మైలవరానికి చెందిన శ్రీ నరసింహ స్వామి మత్స్యకార సంఘంలో 41 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా 2018 సెప్టెంబర్ లో ద్వి, త్రిచక్ర వాహనాల కోసం సబ్సిడీ డబ్బులు డీడీ రూపంలో మత్స్య శాఖ అధికారులకు అందించారు. 2019 మార్చి 7వ తేదీన అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి .. డీడీలు చెల్లించిన కొందరు మత్స్యకారులకు వాహనాలను అందించారు. మైలవరం శ్రీ నరసింహ స్వామి సంఘం సభ్యులకు మాత్రం వాహనాలు అందలేదు. రెండుసార్లు కడపకు వెళ్లి స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టినా.. మత్స్య శాఖ అధికారులు కనికరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు కంపెనీ నుంచి కొంతమంది మత్స్యకారులకు వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ చెల్లించమని నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: భారత సైనికుల శక్తి,సామర్థ్యాలు అజేయం: మోదీ