కడప జిల్లా బద్వేలు - మైదుకూరు 67వ జాతీయ రహదారిపై రాణిబావి ప్రాంతానికి సమీపంలో.. ఫ్లై యాష్ తరలిస్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తి మంటలు అంటుకున్నాయి.
గమనించి అప్రమత్తమైన డ్రైవరు వెంటనే కిందికు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ లోపే లారీలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఘటనపై సమాచారం అందుకున్న బద్వేలు అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి: