ETV Bharat / state

ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని: రవీంద్రారెడ్డి - రాజధానిపై డీఎల్ రవీంద్రను అమరావతి రైతులు కలిశారు

DL Ravindra On Amaravati Capital: జగన్‌ దృష్టిలో అమరావతి రాజధాని కాకపోయినా ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని అని మాజీ మంత్రి డి.ఎల్‌. రవీంద్రారెడ్డి అన్నారు. ఈరోజు వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేటలోని స్వగృహంలో రవీంద్రారెడ్డిని రాజధాని రైతులు కొందరు ఆయనను కలిసి మద్దతు కోరారు.

DL Ravindra
రవీంద్రారెడ్డి
author img

By

Published : Jan 22, 2023, 2:12 PM IST

DL Ravindra On Amaravati Capital: అమరావతి రాజధానిగా ప్రకటించేెెందుకు మద్ధతు ఇవ్వాలని అమరావతి రైతులు వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేటలోని తన స్వగృహంలో మాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ దృష్టిలో అమరావతి రాజధాని కాకపోయినా ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని అని అన్నారు. జగన్‌ ఆలోచన అధికారం, డబ్బు తప్ప మరేమీ లేదని, ప్రత్యర్థులను కక్షతో వేధిస్తున్నారని పేర్కొన్నారు.

అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్‌ గెలవలేడని, రాజధాని కోసం రైతులు త్యాగం చేస్తే ఇష్టానుసారంగా మాట్లాతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని ఎన్నికల్లో జగన్‌ చెత్తచెత్తగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. సుప్రీంకోర్టులో అమరాతికి అనుకూలంగా తీర్పు వచ్చినా జగన్‌ అమరావతిని అభివృద్ధి చేయడన్నారు. జగన్‌ మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని.. త్వరలోనే ప్రజలకు మంచి రోజులు రానున్నాయని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.