కడప జిల్లా రాయచోటి కొత్తపల్లిలో కుటుంబసభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. యువతిపై పెట్రోల్ పోసి కుటుంబసభ్యులే నిప్పంటించారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందనే ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలోనే సోదరుడు తాజుద్దీన్ నిప్పంటించి తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. గాయపడిన యువతిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చదవండీ...Gun firing in Kadapa: గన్‌తో కాల్చేశాడు.. ఆపై కాల్చుకున్నాడు.. ఇద్దరూ మృతి