ETV Bharat / state

విద్యార్ధులు కారు వీరు..చిచ్చర పిడుగులు..! - కర్ర సాము

పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లో ఈ కర్రలేంటీ ఏంటి అని అనుకుంటుంన్నారా? ఈ విద్యార్దులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు వీరికి కర్రసాము విద్య నేర్పిచ్చాడు. వీరి చేతిలో గిర్రున తిరుగుతున్న కర్రను చూశారా..వీరు విద్యార్ధులా..! పిడుగులా..! అనక ఉండలేరు.

కర్రసాముతో అందరినీ ఆకట్టుకుంటున్న..చిచ్చరపిడుగులు
author img

By

Published : Sep 12, 2019, 6:56 PM IST

తాను పాఠాలు చెబుతున్న విద్యార్దులకు ఏదైనా ప్రత్యేక కళను నేర్పించాలనుకున్నాడో ఉపాధ్యాయుడు. అంతే, తనకు తెలిసిన కర్రసాము పై విద్యార్దులకు శిక్షణ ఇచ్చాడు. రోజుల వ్యవధిలోనే బాలలు, బాలికలు అన్నా తేడా లేకుండా పదుల సంఖ్యలో కర్రసాములో ఆరితేరారు. వారు కర్రను తిప్పుతుంటే, ఔరా..అనిపిస్తోంది.

కర్రసాముతో అందరినీ ఆకట్టుకుంటున్న..చిచ్చరపిడుగులు

కడప జిల్లా మైదుకూరు మండలం శ్రీరాంనగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రసాద్ కు కర్ర సాములో ప్రావీణ్యం ఉంది. తాను డిగ్రీ లో నేర్చుకున్న ఈ విద్యను పాఠశాల విద్యార్థులకు నేర్పిస్తే బాగుంటుందని భావించారు. నో బ్యాగ్ డే రోజున ఇద్దరు విద్యార్థులకు..తొలుత కర్రసాము మెలకువలు నేర్పించారు. తరువాత, వీరిని చూసి మరో 13 మంది విద్యార్థులు, కర్రసాము నేర్చుకునేందుకు ముందుకు వచ్చారు. అలా, తోటి విద్యార్దులను చూసి, స్పూర్తి పొందిన విద్యార్దులు కర్రసాములో ప్రావీణ్యం పొందారు. కర్ర చేతికి దొరికితే చాలు వారి చేతుల్లో గిర్రున తిరుగుతోంది. బాలురు బాలికలు మేమేం తక్కువ కాదంటూ పోటీపడి కర్రతిప్పుతున్న వైనంను చూస్తే, వీరు పిల్లలా పిడుగులా అనిపిస్తుంది.

ఇదీ చదవండి:గోదావరి ఉద్ధృతి...జలదిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.