ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కడప రైతులు సమాయత్తమవుతున్నారు. వేరుశనగ పంట సాగుకు పదును దాటిపోవటంతో...నవధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతన్నలకు సూచించారు. ఈ క్రమంలో ఉలవలు, జొన్నలు, కందులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రైతన్నలు దుక్కులు సిద్ధం చేసుకుని... విత్తనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు తరలివస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ కింద 39 వేల హెక్టార్లలో ఈ పంటలు సాగు కానున్నాయి. తెగుళ్లను తట్టుకుని చిన్నపాటి వర్షానికి ఈ పంటలు అధిక దిగుబడి ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాల వారీగా తేదీలు ప్రకటించి విత్తన పంపిణీ జరుపుతామని తెలిపారు.
ఇదీ చూడండి: ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాలు..అద్దె గదులకు టెండర్లు