కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెంలో.. తమ్ముడిని హత్యచేసిన ఘటనలో అన్నను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నదమ్ములైన పెద్దవెంకట సుబ్బయ్య, చిన్న వెంకట సుబ్బయ్యల మధ్య ఏడాది కాలంగా పొలం వివాదం నెలకొంది. ఈనెల 24వ తేదీన పొలం వద్ద పనులు చేసుకుంటున్న తమ్ముడిని.. కాపు కాసి అన్నపెద్ద వెంకట సుబ్బయ్య.. రాళ్ళతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తరలిస్తుండగా 26వ తేదీ సాయంత్రం చిన్న వెంకట సుబ్బయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నపెద్ద వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు