ETV Bharat / state

లారీ ఢీకొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి

బద్వేలు పట్టణంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆటో కోసం ఎదురు చూస్తున్న ఎనిమిదేళ్ల బాలుడిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

accident
బాలుడు మృతి
author img

By

Published : Aug 16, 2021, 10:43 PM IST

కడప జిల్లా బద్వేలు పట్టణంలో ప్రమాదం జరిగింది. 67వ జాతీయ రహదారిపై స్టేట్​ బ్యాంక్​ వద్ద ఎనిమిదేళ్ల బాలుడిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నెల్లూరు జిల్లా పడమటి నాయుడుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటరమణ, ఆదిలక్ష్మి దంపతులు తమ కుమారుడు విగ్నేశ్​(8)ను వెంటబెట్టుకొని ఆధార్ నవీకరణ కోసం బద్వేల్ స్టేట్ బ్యాంక్ వద్దకు వచ్చారు. పని ముగించుకుని.. రోడ్డు పక్క ఆటో కోసం వేచి ఉండగా.. లారీ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో విగ్నేశ్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

కళ్లెదుట కుమారుడు చనిపోయే సరికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెంకటరమణకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు కవలలు కాగా చిన్నవాడు విగ్నేశ్​. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్లెదుటే మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: దారుణం: భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.