Child Kidnap In Rims: కడప రిమ్స్‌లో ఎనిమిది రోజుల చిన్నారి కిడ్నాప్ జరిగింది. నగరంలోని అక్కయపల్లికి చెందిన సోనీ అనే మహిళ చిన్నారి తల్లికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన ఘటన రిమ్స్‌లో చోటు చేసుకుంది. సోనీ అనే మహిళ తనకు గర్భం వచ్చినట్లు ప్లాస్టిక్ బెల్లినీ కట్టుకుని, తన భర్తకు చిన్నారిని చూపిస్తానని చెప్పి బిడ్డను ఎత్తుకెళ్లింది. హాస్పిటల్ సెక్యూరిటీ చిన్నారిని తల్లికి అప్పజెప్పారు. తనకు పిల్లలు లేరని, అందుకే ఇలా చేశానని సోని చెప్పింది. సెక్యూరిటీ సిబ్బంది సోనీనీ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చదవండి