కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రతపై ఈనాడు, ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మట్టిలో కలవని ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశం ప్రపంచానికే ఆదర్శం కావాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ వి.మల్లికార్జున పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ఈనాడు ఈటీవీ భారత్ అవగాహన కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: