పత్రికా రంగంలో రాణిస్తూ.... క్రీడా రంగ అభివృద్ధికీ ఈనాడు మీడియా సంస్థలు చేయూతనిస్తున్నాయని ఏసీఏ నాయకులు వెంకటశివారెడ్డి ప్రశంసించారు. ఈనాడు ఆధ్వర్యంలో కడప శివారులోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో ప్రారంభమైన క్రికెట్ పోటీలను.. వెంకటశివారెడ్డి, స్టెప్ సీఈవో రాంచంద్రారెడ్డి ప్రారంభించారు. మొదటిరోజు రెండు మైదానాల్లో కలిపి 16 జట్లు పోటీ పడ్డాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ నెల 27వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో ఈనాడు కడప విభాగం మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: