Teacher mlc Elections : ఎన్నికలకు మార్గదర్శిగా ఉండాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సైతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం అన్నట్లు.. అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారు. ఓ వైపు ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చడమే గాకుండా.. ఓటర్లను ఆకర్షించడానికి తాయిలాలు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇటీవల టిఫిన్ బాక్సులు పంచుతుండగా సీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సానుభూతిపరులకు కీలక స్థానం.. ఎన్నికల అధికారుల నియామకంలోనూ అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిక వేళ.. పార్టీ సానుభూతిపరులను కీలక పోస్టుల్లోకి పంపిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రభుత్వం కడప ఆర్జేడీగా ప్రతాపరెడ్డిని నియమించిందని విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
వివాదాస్పదమేన ఆర్జేడీ నియామకం.. కడప ఆర్జేడీగా పనిచేస్తున్న ప్రతాపరెడ్డి పై గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈసీ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం ప్రతాప్ రెడ్డిని ఇటీవలే కడప ఆర్జేడీగా నియమించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూలంగా పావులు కదిపేందుకే ప్రతాపరెడ్డిని ప్రభుత్వ నియమించిందని విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు లేవనెత్తాయి. అందుకు అనుగుణంగానే ఆర్జేడీ ప్రతాపరెడ్డి ఇటీవల వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించడం, వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఆ సమావేశాలు ఉపయోగపడే విధంగా అంతర్గతంగా సంభాషణలు చేసినట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.
విచారణకు ఆదేశం.. కొత్త నియామకాలు, తాయిలాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు.. వీటన్నింటిపై కొందరు ఉపాధ్యాయ సంఘం నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా విచారణకు ఆదేశిస్తూ ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు కాపీ ఇవాళ బహిర్గతమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా అధికారిగా పనిచేస్తున్న కడప జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వుల కాపీ అందింది. వెంటనే ఆర్జేడీ ప్రతాపరెడ్డి పై విచారణ చేసే నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి :